- ఈ నెల 11 నుంచి భర్తీ ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను సెక్రటరీ సైదులు శుక్రవారం రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలల్లో మొత్తం 10,138 బ్యాక్‌లాగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అభ్యర్థుల ఫలితాలను సొసైటీ వెబ్‌సైట్లలో https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/homehttps://mjptbcwreis.telangana.gov.in అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థుల వివరాలు సంబంధిత గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు సమాచారం అందిస్తామన్నారు. విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలో ఫోన్ ద్వారా వివరాలు తెలియజేస్తామని సెక్రటరీ వివరించారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
